Poonam Kaur sensational tweets goes viral. Hot discussion on that director
#PoonamKaur
#tollywoodnews
హీరోయిన్ పూనమ్ కౌర్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మెరుపులా సంచలన ట్వీట్స్ చేస్తూ, అందరిని సస్పెన్స్ లోకి నెడుతూ మాయమవుతోంది. పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతోందో అర్థం కాక సినీవర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. ఆ మధ్య ఓ ఫిల్మ్ క్రిటిక్, పూనమ్ కౌర్ మధ్య ట్విట్టర్ వార్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అతడు పూనమ్ కౌర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజగా పూనమ్ కౌర్ ఓ దర్శకుడిని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పూనమ్ కౌర్ ఇలాంటి ట్వీట్స్ చేయడం కొత్తేమి కాదు. నర్మ గర్భ వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో ఎవరినో టార్గెట్ చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ డైరెక్టర్ సినిమాలే కాదు మనుషులని కూడా బాగా డైరెక్ట్ చేయగలడు. నన్ను కూడా డైరెక్ట్ చేయాలని ప్రయత్నించాడు. ఎందుకు ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే ఏమి ఎరుగనట్లు ప్రవర్తించాడు. అతడికి చెందిన అమ్మాయిలు మాత్రమే ఇండీస్ట్రీలో ఉండాలని భావిస్తాడు. ఆ దర్శకుడు ఎవరనే విషయం మాత్రం పూనమ్ కౌర్ వెల్లడించలేదు.
ఎవరికైనా అవకాశం ఇస్తున్నారంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు కనీసం చెప్పలేను కుడా అంటూ పూనం కౌర్ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో పూనమ్ కౌర్ చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
దర్శకుడికి చెందిన ఓ అమ్మాయి వరుసగా ప్లాపుల్లో ఉంది . అయినా కుడా ఆమెకే అవకాశాలు ఇచ్చారు. దానికి గల కారణాలు తెలియవు. అసలు ఇంతకి ఇండస్ట్రీ లో ఏం జరుగుతోంది అంటూ పూనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.