Bigg Boss Season 2 Telugu : Sanjana Scolds Tejaswini

Filmibeat Telugu 2018-06-15

Views 1.8K

Bigg Boss 2 Telugu Day 5 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
#BiggBoss2Telugu

ఒకే టీంలో ఉన్న తేజస్వి, సంజన మధ్య అస్సలు పడటం లేదు. తాజాగా వంట చేసే విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. తేజస్వి వంటచేసి తానే అన్ని మార్కులు కొట్టేస్తుందని, తనకూ అవకాశం ఇవ్వాలని సంజన వాదించిన తీరు, దానికి తేజస్వి రియాక్ట్ అయిన తీరు ప్రేక్షకులకు మరింత చికాకు తెప్పించింది.
ఇక తొలి ఎపిసోడ్‌ నుండి ఉప్పు నిప్పులా ఉన్న సంజనా, తేజస్విల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకర్నొకరు తిట్టుకుంటూ బిగ్ బాస్ షోకి కావాల్సిన మసాలా దట్టించారు. సెలబ్రిటీ అంటూ తోపు అంటూ బయట చూపించుకోండి. అంతే కాని ఎక్స్‌ట్రాలు చేస్తే రక్తం చూసే వెళ్తా అంటూ సింగర్ గీతా మాధురి వద్ద బ్లాస్ట్ అయ్యింది సంజనా.
ఇక బిగ్ బాస్ సీజన్‌ 2లో ఫస్ట్ సీక్రెట్ టాస్క్‌ను తేజస్వికి ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌ను నవ్వుతూ పాజిటివ్ వేవ్‌తో పూర్తి చేయాలంటూ బిగ్ బాస్ ఆదేశించారు. ఈ సీక్రెట్ టాస్క్‌లో భాగంగా తనకు ఎవరైతే గిట్టడం లేదో ఆమెనే మెప్పించాలన్నారు. సంజనా పనులన్నీ నువ్వే చేయాలి. ఆమెను మెప్పించాలి. బాబు గోగినేనిని ఫ్యాషన్‌గా రెడీ చేయాలి. కౌశల్‌కి మసాజ్ చేయాలి. అమిత్‌కి కోపం వచ్చేలా చేయాలి. గీతా మాధురి మేకప్‌ని చెడగొట్టాలి అంటూ సీక్రెట్ ఇచ్చారు. ఇందులో మీరు సఫలం అయితే బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌కి నామినేట్ అవుతారన్నారు. అయితే సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేయలేకపోవడంతో కెప్టెన్ పోటీకి అనర్హులుగా తేజస్విని ప్రకటించారు బిగ్ బాస్.

Share This Video


Download

  
Report form