Bigg Boss Telugu Season 2 First Elimination Sanjana Anne. Actor Nani began by thanking the audience for accepting him as the new host of the show. He went on to appreciate the 20-year-old internet sensation Deepthi Sunaina and told ‘captain’ Samrat that he was a weak leader.
బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్లో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఐదురుగు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వగా.... అందులో ఒకరు తొలివారం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎవరు ఇంట్లో ఉండటం, ఎవరు బయటకు వెళ్లడం అనేది బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. తొలి వారం ఎవరు ఇంటి నుండి బయటకు వెళతారు అనే విషయంలో ఉత్కంఠ నెలకొgది. ఈ ఉత్కంఠకు తెర దించుతూ ఆదివారం రాత్రి జరిగిన షోలో బయటకు వెళ్లేది ఎవరో తేలిపోయింది.
సామాన్యుల కేటగిరీలో బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకున్న ఈ మిస్ హైదరాబాద్ తొలి రోజు నుండే అలజడి సృష్టించడం మొదలు పెట్టించింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తన ప్రవర్తనతో ప్రేక్షకులకు చికాకు తెప్పించి ఇంట్లో కొనసాగే అవకాశం దూరం చేసుకుంది.
తేజస్వితో ప్రతిక్షణం గొడవ పడుతూ ఆమెపై విద్వేషాన్ని పెంచుకున్న సంజన... ప్రేక్షకుల మార్కులు దక్కించుకోవడంలో విఫలమైంది. ఒక రకంగా ఆమె ఉంటే బిగ్ ఇంట్లోని ఇతర సభ్యులు కూడా అసూయ, ద్వేషం లాంటి వాటితో పొల్యూట్ అవుతారేమో? అని స్థాయిలో ప్రేక్షకులు అనుమాన పడేంతలా సంజన అతిగా ప్రవర్తించడమే ఈ పరిణామాలకు దారి తీసినట్లు స్పష్టమవుతోంది.
బిగ్ బాస్ ఇంట్లో నుండి బయటకు వస్తూ సంజన.... తేజస్వి, బాబు గోగినేనిలపై విమర్శల వర్షం కురిపించింది. తేజస్వి పక్కవారితో సవ్యంగా ఉండాలని, అందరినీ సమానంగా చూసే తత్వం ఆమెకు లేదని మండి పడింది. బాబు గోగినేని బయటకు కనిపించేంత మంచి వ్యక్తి కాదని, ఇది కేవలం తన అభిప్రాయమని సంజన తెలిపారు.