Bigg Boss Telugu Season 2 Press Meet : Nani Talks About His Real life Big Boss

Filmibeat Telugu 2018-06-05

Views 137

Bigg Boss Telugu Season 2 Press Meet. Bigg Boss Telugu Season 2 will starts from June 10th
#Bigg BossTelugu Season 2

దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షో అభిమానులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. టివి కార్యక్రమాలలో ఇటీవల అత్యంత ఆదరణ పొందిన షో ఇదే కావడం విశేషం. తెలుగులో స్టార్ మా ఈ క్రేజీ రియాలిటీ షోని ప్రసారం చేయనుంది. తెలుగులో తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సీజన్ సూపర్ హిట్ అయింది. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్న రెండవ సీజన్ అంతకు మించేలా ఉటుందని బిగ్ బాస్ టీం చెబుతోంది. జూన్ 10 నుంచి ఈ రియాలిటీ షో ప్రసారం అవుతున్న సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. న్యాచురల్ స్టార్ నాని తో సహా బిగ్ బాస్ టీం మొత్తం నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని షో గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
బుల్లితెర ప్రేక్షకులని వినోదంతో ముంచెత్తడానికి బిగ్ బాస్ 2 అన్ని హంగులతో ముస్తాబవుతోంది. జూన్ 10 నుంచి ప్రారంభం కానున్న తెలుగు బిగ్ బాస్ 2 సీజన్ 106 రోజులపాటు కొనసాగనుంది.
ఈ సీజన్ లో ఏమైనా జరగొచ్చు అంటూ బిగ్ బాస్ టీం అంచనాలు పెంచేసింది. ఈ సీజన్లో మొత్తం 16 మంది సెలెబ్రిటీలు కాంటెస్ట్ చేయబోతున్నారు. 70 కెమెరాలు ఉపయోగిస్తున్నారు.
తొలి సీజన్ లో ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని నాని ప్రశంసించాడు. ఈ సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఎలా చేశానో నాకే క్లారిటీ లేదు. అందరిలాగే నేను కూడా జూన్ 10 నుంచి తెసులుకుంటా అని నాని తెలిపాడు.
సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీయడం చాలా కష్టం. ఏళ్లతరబడి మాట్లాడుకుంటున్న సినిమా స్థాయిని మించేలా మార్నింగ్ షో లోనే కట్టుకోవాలి అని నాని తెలిపాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తొలి సీజన్ అలాంటిదే అని తేలితెలిపాడు. కానీ తొలి సీజన్ కు మించి ఉండేలా ప్రయత్నించామని నాని తెలిపాడు.

Share This Video


Download

  
Report form