Bigg Boss Telugu Season 2 Press Meet : Nani Comments About Bigg Boss Show

Filmibeat Telugu 2018-06-05

Views 58

Bigg Boss Telugu Season 2 Press Meet. Bigg Boss Telugu Season 2 will starts from June 10th
#Bigg BossTelugu Season 2

దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షో అభిమానులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. టివి కార్యక్రమాలలో ఇటీవల అత్యంత ఆదరణ పొందిన షో ఇదే కావడం విశేషం. తెలుగులో స్టార్ మా ఈ క్రేజీ రియాలిటీ షోని ప్రసారం చేయనుంది. తెలుగులో తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సీజన్ సూపర్ హిట్ అయింది. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్న రెండవ సీజన్ అంతకు మించేలా ఉటుందని బిగ్ బాస్ టీం చెబుతోంది. జూన్ 10 నుంచి ఈ రియాలిటీ షో ప్రసారం అవుతున్న సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. న్యాచురల్ స్టార్ నాని తో సహా బిగ్ బాస్ టీం మొత్తం నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని షో గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
బుల్లితెర ప్రేక్షకులని వినోదంతో ముంచెత్తడానికి బిగ్ బాస్ 2 అన్ని హంగులతో ముస్తాబవుతోంది. జూన్ 10 నుంచి ప్రారంభం కానున్న తెలుగు బిగ్ బాస్ 2 సీజన్ 106 రోజులపాటు కొనసాగనుంది.
ఈ సీజన్ లో ఏమైనా జరగొచ్చు అంటూ బిగ్ బాస్ టీం అంచనాలు పెంచేసింది. ఈ సీజన్లో మొత్తం 16 మంది సెలెబ్రిటీలు కాంటెస్ట్ చేయబోతున్నారు. 70 కెమెరాలు ఉపయోగిస్తున్నారు.
తొలి సీజన్ లో ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని నాని ప్రశంసించాడు. ఈ సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఎలా చేశానో నాకే క్లారిటీ లేదు. అందరిలాగే నేను కూడా జూన్ 10 నుంచి తెసులుకుంటా అని నాని తెలిపాడు.

Share This Video


Download

  
Report form