Bigg Boss Telugu 2 Day 8 highlights. Bigg Boss instructs the contestants to pair up and nominate others for elimination. The new member, Nandini introduces herself and tries to blend in with the housemates.
#BiggBossSeason2Telugu
నాని చెప్పినట్టు రోజు రోజుకీ ఇంకొంచెం మసాలా దట్టిస్తున్నారు. సంజన ఎలిమినేట్ కావడం, ఆమె స్థానంలో మరో బ్యూటీ నందిని ఎంట్రీ ఇవ్వడం షోకి కలిసొచ్చింది. నందిని ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్‌కి కొత్త గ్లామర్ వచ్చింది. అంతేకాకుండా హౌజ్‌మేట్స్‌లో కొత్త ఉత్సాహం కూడా వచ్చింది. ముఖ్యంగా తేజస్వికి. సంజన వెళ్లిపోయి ఆమె స్థానంలో నందిని రావడం ఎంతో బాగుందని తన మనసులో మాటను బయటపెట్టేసింది.
మునగకాడ కూరపై తేజస్వి, భానుశ్రీ మధ్య కాస్త ఘాటైన సంభాషణలు జరిగాయి. ‘తేజూ మునగకాడ కూర ఎఫెక్ట్ మామూలుగా లేదు, ఇకపై మునగకాడ కూర చేయొద్దు’ అంటూ తేజస్విని గట్టిగా పట్టుకుని భానుశ్రీ కాస్త మసాలా దట్టించింది. అదే సమయంలో అమిత్, రోల్ రైడా ఒకరినొకరు కౌగిలించుకుని కనిపించారు. ఈ సంఘటణను చూపిస్తూ.. ‘చూడు తేజూ నీ మునగకాడ కూర ఎఫెక్ట్’ అంటూ గట్టిగా నవ్వింది. బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్పుడు ఈ వీడియోను వాడుకోండి అంటూ తేజస్వి సలహా ఇచ్చింది.