Chiranjeevi Sye Raa Movie Action Scenes Started Shooting

Filmibeat Telugu 2018-06-04

Views 735

Interesting news on Megastar Chiranjeevi SyeRaa movie. Action episode will shoot soon
#MegastarChiranjeevi
#SyeRaa
#nayanthara

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సైరా చిత్రం దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడెక్షన్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అతిరధ మహారథులుగా చెప్పబడే నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ చిత్రంలో కామియో రోల్ పోషిస్తుండగా, నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబందించి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది.
సైరా చిత్రం ఇప్పటికే కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభించబోయే షెడ్యూల్ లో సినిమాకే హైలైట్ గా నిలిచే యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ యాక్షన్ సన్నివేశాల్ని నైట్ ఎఫెక్ట్ తో చిత్రీకరిస్తారట. సైరా నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులపై అటాక్ చేసే సన్నివేశం ఇది. ఈ పోరాటంలో గుర్రాలు గట్రా ఏమి ఉండవు. తుపాకులు, ఇతర మారణాయుధాలు ఉపయోగించి సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ సైనికులతో తలపడబోతున్నాడు.

Share This Video


Download

  
Report form