Nayanthara begins shooting for Chiranjeevi's Sye Raa Narasimha Reddy. The actress joined the cast and crew a few days ago and has started shooting for the film. Apart from Sye Raa Narasimha Reddy, Nayanthara's upcoming projects include Chakri Toleti directorial Kolaiyuthir Kaalam, Ajay Gnanamuthu's Imaikkaa Nodigal, and Nelson Dilipkumar's Kolamavu Kokila.
తమిళనాట నడుస్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రైక్ నేపథ్యంలో హీరోయిన్ నయనతార తన తమిళ సినిమాలకు సంబంధించి డేట్స్ రీ షెడ్యూల్ చేసుకోక తప్పలేదు. ప్రస్తుతం ఆమె అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'విశ్వం' షూటింగులో పాల్గొనాల్సి ఉంది. స్ట్రైక్ కారణంగా షూటింగ్ ఆగి పోవడంతో ఆ డేట్స్ తెలుగు ప్రాజెక్ట్ 'సైరా నరసింహా రెడ్డి' కోసం కేటాయించారట. ఆల్రెడీ ఆమె 'సైరా' షూటింగులో జాయిన్ అయ్యారు. నయనతారతో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ...‘ఇంతకు ముందు నయనతారతో ఓ యాడ్ ఫిల్మ్ షూట్ చేశాను. ఆమె సెట్లోకి అడుగు పెట్టడంతోనే కెమెరాకు కంఫర్టబుల్‌గా మారిపోతుంది' అని తెలిపారు.
విశ్వం, సైరా నరసింహారెడ్డి చిత్రాలతో పాటు చక్రి టోలేటి దర్శకత్వంలో ‘కోలైయుతిర్ కాలమ్', అజయ్ జ్ఞానముత్తు ప్రాజెక్ట్ ‘ఇమైక్కా నొడిగల్', నెల్సన్ దిలిప్ కుమార్ ప్రాజెక్ట్ ‘కోలమావు కోకిలా' చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు నయనతార.
కాగా... ‘సైరా నరసింహా రెడ్డి' టీమ్ తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత వారమే లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. ఇందుకోసం సౌత్ ఆఫ్రికా నుండి స్టంట్ కొరియోగ్రాఫర్‌ను కూడా హైర్ చేసుకున్నట్లు సమాచారం.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళంతో పాటు అనే భాషల్లో ఈ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.