Actor Irrfan Khan Attends To England Match

Filmibeat Telugu 2018-05-30

Views 1.1K

Bollywood actor Irrfan Khan left abroad for treatment for neuroendocrine tumour in March this year. Little has been known about the talented actor since then and now a picture of the actor enjoying a test match between England and at the Lord's in London is doing the rounds on social media.

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధితో బాధపడుతూ విదేశాల్లో చికిత్స పొందుతున్నారు. ఇర్ఫాన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు మార్చిలో ఓ వార్త బయటకు రావడంతో బాలీవుడ్ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఎక్కువ రోజులు ఇక బ్రతకరంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారంతో ఫ్యాన్స్ కలత చెందారు. మృత్యువుతో పోరాడుతున్న వార్తల నేపథ్యంలో ఇర్ఫాన్ ఇంగ్లండ్, పాకిస్థాన్ మ్యాచ్ చూస్తూ కనిపించడంతో అభిమానులు ఊరట చెందుతున్నారు.
మార్చిలో ఇర్ఫాన్ న్యూరోఎండ్రోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధికి గురైనట్టు వార్తలు వచ్చాయి. దాంతో చికిత్స కోసం ఆయన లండన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వార్తల్లో ఇర్ఫాన్‌ను చూసిన దాఖలాలు లేవు.
తాజాగా లండన్‌లో జరుగుతున్న ఇంగ్లండ్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కెమెరాకు చిక్కారు. ఆ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇర్ఫాన్ ఫోటోకు విశేష స్పందన లభిస్తున్నది. ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ తన సత్తాను చాటాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
ఇర్ఫాన్ చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన తర్వాత ఆయన నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం రిలీజైంది. తాజాగా కార్వాన్ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రంతో దుల్కర్ సల్మాన్ తొలిసారి బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇర్ఫాన్ ట్వీట్ చేస్తూ.. ఆరంభంలో అమాయకత్వం చూడటానికి బాగుంటుంది. దానికి వెలకట్టలేం. దుల్కర్, మితిలా పార్కర్‌కు బెస్టాఫ్ లక్ అని ఇర్ఫాన్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తే సినిమా ప్రారంభించాలని ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్‌ ఎదురుచూస్తున్నారు. ఇర్ఫాన్‌తో స్వప్న దిది బయోపిక్‌ను విశాల్ తెరకెక్కించేందుకు రెడీగా ఉన్నారు. అలాగే మరో దర్శకుడు సుజిత్ సర్కార్‌ కూడా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.

Share This Video


Download

  
Report form