Deepika Padukone To Act In Vishal Bhardwaj Movie

Filmibeat Telugu 2018-05-21

Views 672

Deepika Padukone is hot property in Bollywood. Her last film, Padmaavat, crossed the Rs 500-crore mark worldwide, but she is in no hurry to sign any new projects. She was supposed to start shooting for Vishal Bhardwaj's gangster drama, but the film was put on the backburner owing to her co-star Irrfan's health woes. The actress has no other films in her kitty.
#padmaavat
#DeepikaPadukone
#Bollywood
#VishalBhardwaj

వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న బాలీవుడ్ తార దీపికా పదుకోన్ వేగానికి కొంచెం కళ్లెంపడినట్టు కనిపిస్తున్నది. పద్మావతి చిత్రం తర్వాత ఏ చిత్రానికి కూడా ఒకే చెప్పకపోవడంతో బాలీవుడ్‌లో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రణ్‌వీర్‌తో పెళ్లి అంటూ, లేదా ఆరోగ్యం సరిగా లేకపోవడం అంటూ అనేక రకాలుగా చర్చనీయాంశమయ్యాయి. అయితే దీపికా సినిమాలు సెట్స్ పైకి వెళ్లకపోవడానికి ప్రధాన కారణాలు ఇవేనంటూ బాలీవుడ్ పత్రికలు విశ్లేషిస్తున్నాయి.
కానీ పద్మావతికి ముందే దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించే గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కానీ విశాల్ భరద్వాజ్ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే సమయంలోనే అనూహ్యంగా బ్రేక్ పడింది. ఈ చిత్రంలో దీపికా పక్కన నటించనున్న ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమించడంతో గ్యాంగ్‌స్టర్ డ్రామా షూటింగ్ నిలిచిపోయింది. దాంతో రెడీగా సినిమాలు చేతిలో లేకపోవడంతో ప్రస్తుతం గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా, దీపికా పదుకొనే ఆరోగ్యంపై కూడా అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె వెన్ను, మెడ నొప్పితో బాధపడుతున్నట్టు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇటీవల వెన్నునొప్పి గాయం తిరగతోడటంతో ఆమె సినిమాలకు దూరంగా ఉందనే మాట వినిపిస్తున్నది. త్వరలోనే ఈ సమస్య నుంచి బయడపడుతారు అని ఆమె సన్నిహితులు వెల్లడించారు.

Share This Video


Download

  
Report form