All Crazy Directors Attends Dinner Meet At Vamshi Paidipally House

Filmibeat Telugu 2018-06-05

Views 718

All crazy directors attends dinner meet at Vamshi Paidipally house. Pic goes viral in social media
ఈ మధ్య కాలంలో గమనిస్తే టాలీవుడ్ నుంచి ప్రతిభ గల దర్శకులు బయటకు వస్తున్నారు. అద్భుతమైన చిత్రాలు తీస్తూ టాలీవుడ్ స్థాయి పెంచుతున్నారు. ఆల్రెడీ అగ్రదర్శకుడైన రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన సంగతి తెలిసిందే. సుకుమార్, కొరటాల శివ లాంటి దర్శకులు కూడా భారీ చిత్రాలతో విజయాలు అందుకుంటున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంతో యువ దర్శకుడు సందీప్ రెడ్డి సంచలనం సృష్టించారు. ఇలాంటి దర్శకులంతా ఒకే చోటికి చేరితే ఆసక్తికరంగానే ఉంటుంది.
ఊపిరి లాంటి చిత్రంతో తన సత్తా చాటుకున్న వంశీ పైడిపల్లి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. గత రాత్రి వంశీ పైడిపల్లి తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, నాగ అశ్విన్, క్రిష్ హాజరయ్యారు.
వంశీ పైడిపల్లి ఇంట్లో విందుకు హాజరైన దర్శకులంతా టాలీవుడ్ లో జోరుమీద ఉన్న దర్శకులే కావడం విశేషం, సుకుమార్ రంగస్థలం చిత్రంతో, కొరటాల భరత్ అనే నేనుతో, నాగ అశ్విన్ మహానటి చిత్రంతో ఘనవిజయాలు సొంతం చేసుకున్నారు.
మిగిలిన దర్శకులలో క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ చేతిలో కూడా భారీ చిత్రాలు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS