The 39-year-old holds the first-class Irish record for the most runs in a match, scoring 231 against United Arab Emirates in 2015.He will take up a new role as a member of Ireland's coaching staff.
అంతర్జాతీయ క్రికెట్‌కు డివిలియర్స్ గుడ్ బై చెప్పిన మరుసటి రోజే మరో అంతర్జాతీయ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ ఇరు జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఎడ్ జాయిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించాడు.
మే నెలారంభంలో పాకిస్థాన్‌తో..ఐదు రోజుల ఫార్మాట్ హోదా దక్కించుకున్న ఐర్లాండ్.. తొలి టెస్టు ఆడింది. అయితే ఈ మ్యాచ్ తన ప్రొఫెషనల్ క్రికెట్‌కు ఆఖరి మ్యాచ్ అంటూ జాయిస్ వీడ్కోలు పలకడం అందర్ని ఆశ్చర్యంలో పడేసింది. ఐర్లాండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం ద్వారా తన కల నెరవేరిందని చెప్పిన జాయిస్.. రిటైర్మెంట్‌కు ఇదే మంచి సమయమని చెప్పాడు.
39 ఏళ్ల జాయిస్.. ఇప్పటివరకు 78 వన్డేలు ఆడాడు. ఇందులో 17 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 18 టీ20ల్లో రెండు ఇంగ్లండ్‌కు ఆడాడు. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ తరఫున బరిలోకి దిగిన జాయిస్.. సీనియర్ బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకున్నాడు. 1999లో కౌంటీ కెరీర్‌ను మొదలుపెట్టిన జాయిస్.. గతేడాది దానికి వీడ్కోలు పలికాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న తాను కోచ్‌గా పని చేస్తానని వెల్లడించాడు.