IPL 2018: IPL 2018: CSK's Ambati Rayudu Has A New Song Dedicated By Mark Wood

Oneindia Telugu 2018-05-17

Views 122

It is Mark Wood, who composed the jingle for Ambati Rayudu. The official social media handle of the Chennai Super Kings has posted this

ఐపీఎల్ 11లో చెన్నై ఆటగాళ్లు భళే ఉత్సాహంగా గడిపేస్తున్నారు. అయితే వారితో పాటుగా మద్దతిచ్చే వాళ్లూ తక్కువ సంఖ్యలో లేరు. ఈ మధ్య సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. బౌలర్లను అదరగొడుతున్న అంబటి రాయుడుపై డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఓ వీడియో విడుదలైంది. ఇది చెన్నై ఆటగాళ్లది కాదు. ఇంగ్లాండ్ క్రికెటర్లది. హైదరాబాదీ ఆటగాడైన అంబటి రాయుడి గురించి ఆ జట్టు ఆటగాడు మార్క్‌వుడ్‌ ఓ పాట సిద్ధం చేశాడు. ఆ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.
డు..డు..డు.. అంబటి రాయుడు' అంటూ సాగే ఈ పాటను మార్క్‌వుడ్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వుడ్‌ పోస్ట్‌ చేసిన ఈ పాట అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో విశేషంగా రాణిస్తోన్న ఆటగాళ్లలో రాయుడు ఒకడు. 12 మ్యాచ్‌ల్లో 535 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
'చెన్నైని చూసినప్పుడల్లా నా సొంత ప్రదేశంలో ఉన్నట్టే అనిపిస్తోంది. ఇది సరిపోదు. అస్సలు సరిపోవట్లేదు. ఏమైతే చెప్పిందో చెన్నై.. అవన్నీ చేసి చూపిస్తోంది.. అయినా ఈ బంధం సరిపోదు. డు.. డు.. డు.. డు.. డు.. డు.. అం.. బ..టి..రాయ్..డు' అనే అర్థంతో సాగుతోందీ పాట.
ఈ ప్రదర్శన చూసిన బీసీసీఐ సెలక్టర్లు రాయుడుకి తిరిగి భారత జట్టులో ఆడే అవకాశాన్ని సైతం కల్పించారు. కొన్ని కారణాల వల్ల మార్క్‌వుడ్‌ మధ్యలోనే ఐపీఎల్‌ను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో వుడ్‌ చెన్నై తరఫున కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అది కూడా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే. తాజాగా మార్క్‌వుడ్‌ డ్రస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్ల మధ్య రాయుడుపై రాసిన పాటను పాడుతూ కనిపించాడు. వుడ్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తమ గొంతుతో పాటు కాలును కదిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS