Civils Topper Inspires From Ram Gopal Varma

Filmibeat Telugu 2018-05-10

Views 828

Civils Topper Yedavelli Akshay Kumar about Ram Gopal Varma. He is hardcore fan to Varma
#CivilsTopper
#RamGopalVarma
#CivilsTopperYedavelliAkshayKumar

రాంగోపాల్ వర్మని, వివాదాలని వేరు చేసి చూడలేం. వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలవడం వర్మకు అలవాటే. వర్మతో మాట్లాడడం, వాదించడం చాలా కష్టం అని అంతా భావిస్తుంటారు. ఎందుకంటే వర్మ వితండ వాదం చేయడంలో దిట్ట. ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని లాజికల్ గా వాదించడంలో వర్మ ఆరితేరిపోయారు. కొంతమంది వర్మకు పైత్యం అని సరిపెట్టుకుంటారు. వర్మ ధోరణికి అభిమానులు కూడా ఉన్నారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. కానీ ఓ సివిల్స్ టాపర్ వర్మకు పరమ భక్తుడు, వర్మ లేకపోతే తన జీవితమే లేదని చెప్పాడని తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం. సివిల్స్ టాపర్ యడవెల్లి అక్షయ్ కుమార్ వర్మ ఫై తనకున్న అభిమానం గురించి ఏం చెప్పాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఓ ఇంటర్వ్యూ లో తన గురించి మాట్లాడిన సివిల్స్ టాపర్ వీడియోని వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
వర్మ కొత్త వీడియో వచ్చింది అంటే దానిని చూడకుండా నిద్ర పోనని అక్షయ్ కుమార్ అన్నారు. ఆయన ప్రతి ప్రశ్నకు లాజికల్ గా ఇచ్చే సమాధానం, సమాజాన్ని అయన చూసే కోణం తనకు చాలా బాగా నచ్చే అంశాలని ఈ యువ సివిల్స్ టాపర్ అక్షయ్ అన్నారు.
వర్మని అనుసరించక ముందు తన మైండ్ సెట్ వేరుగా ఉండేదని, కానీ ఆయనని అనుసరించడం మొదలు పెట్టక మెదడుకు హద్దులు లేకుండా ఆలోచనలు మెదలయాని అన్నారు. వర్మని ఫాలో అయిన తరువాతే తనకు పూర్తికాగా కోపం పోయిందని అక్షయ్ కుమార్ తెలిపాడు.
చాలా మంది తత్వవేత్తలని వర్మ చిన్నతనంలోనే చదివేశారని, కానీ తాను అంతమందిని ఇప్పుడు చదవలేనని అన్నారు. దానికి బదులుగా వర్మని చదివితే సరిపోతుందని తెలిపారు.
వర్మ లేకపోతే తనకు జీవితమే లేదని సివిల్స్ టాపర్ అక్షయ్ కుమార్ చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. వర్మని అనుసరించాకే తన ఆలోచన విధానం మారిందని అక్షయ్ తెలిపాడు. ఒక యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న తాను ఎలా మారడానికి కారణం వర్మ అని తెలిపాడు.

Share This Video


Download

  
Report form