Ram Gopal Varma Officer Movie Script Leaked

Filmibeat Telugu 2018-05-17

Views 1.6K

Writer Jaya kumar accused the RGV's new film called Officer with Nagarjuna is another copy of his old script. He said he suspects RGV for practicing plagiarism once again by taking his script without his permission. Now Jaya kumar leaked total script of "Officer" online.
#RGV
#Officer
#Nagarjuna

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆఫీసర్' మూవీ స్క్రిప్టు తనదే అంటూ రచయిత జయకుమార్ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ తన స్క్రిప్టును కాపీ కొట్టి ఈ మూవీ తీశారని ఆయన ఆరోపించారు. తనకు జరిగిన మోసం గురించి హీరో నాగార్జునకు చెప్పి న్యాయం కోరడానికి ప్రయత్నించినా సాధ్యం కాక పోవడంతో చివరకు 'ఆఫీసర్' స్కిప్టు మొత్తాన్ని ఇంటర్నెట్లో పెట్టేసి సంచలన చర్యకు పాల్పడ్డాడు జయకుమార్.
నాకు జరిగిన మోసం గురించి నాగార్జునగారికి చెప్పి న్యాయం కోరడానికి శతవిధాలా ప్రయత్నం చేశాను. కానీ కానీ నా స్క్రిప్టును కాపీ కొట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి, అతడికి సపోర్ట్ చేసిన నిర్మాత దాకా అందరూ నా దారులన్నీ మూసేశారు... అని జయకుమార్ పేర్కొన్నారు.
ఆఫీసర్' పేరుతో తాను రాసుకున్న స్క్రిప్టు మొత్తాన్ని జయకుమార్ ఆన్‌లైన్లో లీక్ చేశారు. వర్మ తీసిన ‘ఆఫీసర్' మూవీతో స్క్రిప్టుతో ఇది ఏ మేరకు మ్యాచ్ అవుతుందో అంటూ అంతా ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
మొత్తం 23 పేజీల్లో రాసిన పూర్తి స్క్రిప్టును జయకుమార్ విడుదల చేశారు. ఇందులో ప్రతి పాత్రకు సంబంధించిన డైలాగులతో పాటు డిటేల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ స్క్రిప్టు మీద రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా... ‘ఆఫీసర్' మూవీ మే 25న విడుదల కావాల్సి ఉండగా... కొన్ని టెక్నికల్ కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు. ఈ మేరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జూన్ 1న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

Share This Video


Download

  
Report form