Ram Gopal Varma Complaints To Police On Jaya Kumar

Filmibeat Telugu 2018-05-22

Views 1

RamGopal Varma filed against young writer. Case about RGV morph photos
#RamGopalVarma
#Officer

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు. అత్యంత పెద్ద చిక్కుల్లో చిక్కుకుని వర్మపై కేసులు నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వర్మ దేనిని సీరియస్ గా భావించడు. తనదారి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తాడు. కానీ తొలి సారి వర్మ ఓ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఏకంగా పోలీస్ కేసు కూడా నమోదు చేశాడు. వర్మని అంతలా వేధించిన ఆ సంఘటన ఏంటో వివరాల్లో తెలుసుకుందాం..
రాంగోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జునతో ఆఫీసర్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 25 నే విడుదల కావలసి ఉంది. కానీ బాంబే కోర్టులో కేసు వలన ఈ చిత్రం జూన్ 1 కి వాయిదా పడింది. యువ రచయిత జయకుమార్ ఆఫీసర్ చిత్రం విషయంలో మరో వివాదం రేపాడు.
రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఆఫీసర్ చిత్ర కథ తనదే అని జయకుమార్ ఇటీవల ఆరోపించాడు. న్యాయం చేయాలంటూ ఇటీవల జయకుమార్ నాగార్జునకు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వర్మ రూపొందించిన జీఎస్టీ ఐడియా కూడా తనదే అని జయకుమార్ అంటున్నాడు. సర్కార్ 3 చిత్రానికి జయకుమార్ రచనా సహకారం అందించాడు.
తన కథతో వర్మ ఆఫిసర్ చిత్రాన్ని రూపొందించిందని జయ కుమార్ ఆరోపిస్తుంటే.. వర్మ అతడిపైనే కేసు నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పంజాగుట్ట పోలిసులని ఆశ్రయించిన వర్మ.. జయకుమార్ పై కేసు నమోదు చేశాడు.

Share This Video


Download

  
Report form