IPL 2018: Gayle Stumped Out For Wide Ball

Oneindia Telugu 2018-05-09

Views 183

Kings XI Punjab skipper Ravichandran Ashwin seemed mighty pleased with his team's bowling effort during mid-innings' break for they had restricted hosts Rajasthan Royals to 158/8. But his happiness was short-lived as his team failed to overhaul the target of 159 and their batsmen, barring KL Rahul, looked nowhere in control and they eventually lost the game by a huge margin of 15 runs.


గెలవాలనే కసి, భారీ పట్టుదలతో రాజస్థాన్ జట్టు తీవ్రంగా శ్రమించి పంజాబ్‌ను ఓడించగలిగింది. ఐపీఎల్ 11లో భాగంగా మంగళవారం పంజాబ్, రాజస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గేల్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. విధ్వంసకర బ్యాట్సమన్ క్రిస్ గేల్‌ను యువ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ బోల్తా కొట్టించాడు. గౌతమ్ వేసిన బంతిని సిక్సర్ బాదేద్దామని ముందుకు వచ్చిన గేల్‌కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చాడు.
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆరంభంలోనే ఆటంకం ఎదురైంది. మూడో ఓవర్ తొలి బంతికే క్రిస్ గేల్ స్టంపౌట్ అయ్యాడు. అది కూడా వైడ్ బాల్‌కి.
గేల్ కచ్చితంగా ముందుకు వస్తాడని గమనించిన గౌతమ్.. బంతిని దూరంగా (వైడ్) వేశాడు. వెంటనే బంతిని అందుకున్న కీపర్ బట్లర్ వికెట్లను గిరాటేశాడు. బంతిని గమనించి వెంటనే వెనక్కి వెళ్లలేకపోయిన గేల్ పిచ్‌పై పడిపోయాడు. ఈ కరేబియన్ విధ్వంసకర ఆటగాడి వికెట్ తీయగానే గౌతమ్ ఆనందానికి అవధుల్లేవు. ఈ ఆసక్తికర దృశ్యం మ్యాచ్‌ చూస్తున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అదే ఓవర్‌లో కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌(0)ను కూడా గౌతమ్ ఔట్ చేశాడు. క్లియర్ బాల్‌కి అశ్విన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 14 పరుగులకే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి గేల్ స్టంపౌట్ కావడానికి ముందు బ్యాట్‌ను మార్చుకున్నాడు. కొత్త బ్యాట్‌తో దుమ్మురేపుదాం అనుకునేలోపే పెవిలియన్‌కు చేరాడు.

Share This Video


Download

  
Report form