Salman Khan hugging Elli Avram. Pics goes viral in social media
#SalmanKhan
#ElliAvram
#Luliavantra
సల్మాన్ ఖాన్ ఏదో ఒక విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. కాగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తాను కమిటైన ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ జీవితంలో పెళ్లి అనేది లేకపోయినా ప్రేమ వ్యవహారాలకు మాత్రం తక్కువ కాదు. సల్మాన్ ఖాన్ తో రొమేనియన్ బ్యూటీ ఇలియా వంటూర్ చాలా కాలం నుంచి ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్ బర్డ్స్ మధ్యచోటు చేసుకున్న ఘటన బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
సల్మాన్ ఖాన్ రేస్ 3 చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో ఖాళీ దొరికినప్పుడల్లా తన స్నేహితులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడట. సల్మాన్ ఖాన్ రొమేనియన్ బ్యూటీ ఇలియాలో ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
స్వీడన్ భామ ఎల్లి అవ్రం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. నిన్న మొన్నటి వరకు ఈ భామ స్వీడన్ లో తన ఫ్యామిలీతో గడిపింది. ఇటీవలే ముంబైకి చేరుకుంది. ఈ హాట్ బ్యూటీ సల్మాన్ ఖాన్ కోసమే ముంబై వచ్చిందా అని ఈ ఫోటోలు చూస్తే అనిపించక మానదు.