MS Dhoni as Kaala : Video Viral

Oneindia Telugu 2018-03-06

Views 66

Team India's former captain Mahendra Singh Dhoni's fans made a teaser, which is being viral on social media
సూపర్ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్ల నిషేధం తర్వాత ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది పునరాగమనం చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేఫథ్యంలో ఈ టీజర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎడిట్‌ చేసి ధోనిని కాలాగా చూపిస్తూ టీజర్‌‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధోని ఆడిన గత మ్యాచ్‌లు, పలు సందర్భాల్లో ధోని పాల్గొన్న ప్రెస్‌ మీట్లు, కొన్ని యాడ్‌ కోసం ధోని యాక్ట్‌ చేసిన సన్నివేశాలతో ఈ టీజర్‌ను ఎడిట్‌ చేశారు.

ఈ వీడియోలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, డైలాగ్స్‌ అన్ని చక్కగా కుదిరాయి. లిప్ సింక్ కూడా అవడంతో ఈ వీడియోని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా ఏప్రిల్‌ 27న విడుదల కానుంది. ఈ సినిమాకి నిర్మాతగా రజనీ అల్లుడు ధనుష్ వ్యవహారిస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ ధోని జీవితంపై వంద సినిమాలు తీసినా సరిపోవని, అత్యుత్తమ క్రీడాకారుల్లో ధోనీ ఒకరని చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటివాళ్ళకి 'కాలా'గా ధోని కనబడడం పండగే !

Share This Video


Download

  
Report form