Brahmanandam recently went to pay his tribute to deceased comedian, Gundu Hanumantha Rao, he became quite emotional. Brahmi has reportedly taken Adithya under his wings as he doesn't have anyone to take care of him.
ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు గుండు హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. హనుమంతరావు మరణంతో అతడి తనయుడు ఆదిత్య శోకసముద్రంలో మునిగి పోవడం అందరినీ కలిచి వేసింది. ఇప్పటికే తల్లిని, సోదరిని కోల్పోయిన ఆదిత్య ఇపుడు తండ్రి మరణంతో మరింత కృంగిపోయాడు. ఎవరూ లేని అనాదగా మారిన ఆదిత్యను ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం చర్చనీయాంశం అయింది.
గుండు హనుమంతరావు తనయుడు ఆదిత్యను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఆ స్టార్ మరెవరో కాదు.... టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం. గుండు హనుమంతరావుకు అత్యంత సన్నిహితుల్లో బ్రహ్మానందం ఒకరు.
ఆదిత్య చదువు బాధ్యతలతో సహా అతడి పెళ్లి బాధ్యతలు కూడా తానే దగ్గకుండి చూసుకుంటానని బ్రహ్మానందం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. హనుమంతరావు కొడుక తన కొడుకుతో సమానమని, అతడికి ఏ లోటూ రాకుండా చూసుకుంటానని ,ఆ విషయంలో ఆదిత్య ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రహ్మానందం భరోసాఇచ్చారట.
ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బ్రహ్మానందం మీద ఓ అపోహ ఉంది. అతడు ఎంత సంపాదించినా ఎవరికీ ఒక్కరూపాయి కూడా ఇవ్వరని కొందరు అంటుంటారు. మరి తాజా సంఘటనతో అయినా అలా అనేవారి నోళ్లు మూతపడతాయని ఆశిద్దాం.