Young Hero Raj Tarun’s new movie titled “Lover” launched today morning in Hyderabad with a formal pooja ceremony. The film produced by Dil Raju and directing by a newcomer Anish Krishna. Gayathri Suresh playing the female lead role opposite Raj Tarun in this flick. Director Anil Ravipudi clapped the soundboard for Muhurat shot, and Harish Shankar switched on the camera.
టాలీవుడ్‌లో ఎలాంటి వారసత్వం లేకుండా హీరోగా నిలదొక్కుక్కున్న వారిలో రాజ్ తరుణ్ ఒకరు. ఉయ్యాల జంపాలా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన సినిమా చూపిస్తా మావ, కుమారి 21ఎఫ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి.
ఇలా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న రాజ్ తరుణ్ తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం అక్టోబర్ 24 (మంగళవారం) జరిగింది. ఈ చిత్రానికి లవర్ అనే పేరును ఖారారు చేశారు. అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా, హరీష్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.