Actor Vikram recently took to Instagram and confirmed that he will be playing the titular role in the period drama ‘Mahavir Karna’ and adding a new dimension to his career.
'బాహుబలి' ప్రాజెక్టు వచ్చే వరకు ఇండియాలో అంత భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా లేదు. అసలు ఆ సినిమా వచ్చే వరకు ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్లు వసూలు చేసిన దమ్మున్న చిత్ర రాజమే లేదు. బాహుబలి-2 విడుదలైన తర్వాతే మన సినిమా రూ. 2000 కోట్లు వసూలు చేయగలదు అనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. విదేశీ చిత్ర నిర్మాణ సంస్థలు కూడా ఇండియన్ సినిమా మార్కెట్ మీద దృష్టి సారించేలా చేశాయి.
అయితే ఇండియన్ సినీ పరిశ్రమలో మరో భారీ చిత్రం రాబోతోంది. బడ్జెట్ రూ. 300 కోట్లతో ఎపిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్క నుంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘మహావీర్ కర్ణ' పేరుతో ఈ చిత్రం రూపొందనుంది.
సౌత్ స్టార్ విక్రమ్ ఈ చిత్రంలో కర్ణుడి పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రం హిందీలో తెరకెక్కుతోంది. అయితే హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం ఇతర ఇండియన్ భాషల్లో కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మలయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.