Anupama Parameswaran is now in consideration to play the female lead in the film that marks the debut of Chiranjeevi's son-in-law Kalyan Kanuganti. Jatha Kalise fame Rakesh Sashi is the director of the film and Sai Korrapati is going to produce the movie.
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఖరారైనట్లు సమాచారం.
ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కళ్యాణ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించే అవకాశాలున్నట్లు టాక్. ఇటీవలే చిత్ర బృందం ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం.కళ్యాణ్ యాక్టింగ్, డాన్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్, వరుణ్ తేజ్ లకు శిక్షణ ఇచ్చిన ‘స్టార్ మేకర్' సత్యానంద్ వద్దే కళ్యాణ్ కూడా శిక్షణ తీసుకున్నారట.
కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యే ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. జనవరి నెలలో మంచి రోజు చూసి సినిమాను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.