IND VS SA 5th ODI: Virat Kohli Angry reaction on Dhoni's Wrong DRS

Oneindia Telugu 2018-02-14

Views 566


MS Dhoni goes wrong with DRS call in IND VS SA 5th ODI. Virat Kohli gets Angry on Dhoni

సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పోర్ట్‌ ఎలిజబెత్‌‌ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో విజయం సాధించి సిరిస్‌ను 4-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన ఐదో వన్డేలో వికెట్ కీపర్ ధోని డీఆర్‌ఎస్ అంచనా తప్పడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ కాసేపు మైదానంలో కోపంతో ఊగిపోయాడు.
డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అనేంతగా ధోని పాపులర్ అయ్యాడు. దీంతో వన్డే, టీ20ల్లో ధోని సలహా తీసుకోనిదే.. కోహ్లీ సైతం డీఆర్‌ఎస్ అడిగే సాహసం చేయడు. శనివారం జరిగిన నాలుగో వన్డేలో కూడా ధోని సలహా తీసుకుని డీఅర్ఎస్‌లో కోహ్లీ సక్సెస్ అయ్యాడు. కానీ ఐదో వన్డేలో మాత్రం ధోని డీఆర్ఎస్ అంచనా తప్పింది. భారత మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు గాను సఫారీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ తరచూ క్రీజు వెలుపలికి వచ్చి బంతిని హిట్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన చాహల్ ఎక్కువగా బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపల విసురుతూ వచ్చాడు. ఇందులో భాగంగానే ఆ ఓవర్‌లోని నాలుగో బంతిని లోపలికి టర్న్ చేయగా.. మిల్లర్ హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ని తాకింది. దీంతో ఫీల్డర్లు ఔట్ కోసం అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ అప్పీల్‌ని తిరస్కరించాడు. దీంతో ఎల్బీఏమో అని అనుమానం వ్యక్తం చేసిన చాహల్.. డీఆర్‌ఎస్ అడగాల్సిందిగా కెప్టెన్ కోహ్లీని కోరాడు.
దీంతో కోహ్లీ... ధోని సూచన అడిగి అనంతరం డీఆర్‌ఎస్ కోరాడు. అయితే, రీప్లైలో బంతి టర్న్ తీసుకుని లెగ్‌స్టంప్‌కి అవతలకి వెళ్తున్నట్లుగా కనిపించింది. దీంతో అంపైర్ నాటౌట్ అంటూ తన మునుపటి నిర్ణయానికే కట్టుబడగా భారత్ తనకున్న ఏకైక రివ్య్వూ ఆప్షన్‌ని కోల్పోయింది. రివ్యూలో బంతి లెగ్‌స్టంప్‌కి అవల వెళ్తుండటాన్ని చూసిన విరాట్ కోహ్లి కోపంతో ఊగిపోయాడు

Share This Video


Download

  
Report form