IND vs SA 5th ODI : A Challenge Before Virat Kohli & Co | Oneindia Telugu

Oneindia Telugu 2018-02-12

Views 343

India have played four ODIs on Port Elizabeth ground and lost on all occasions. India played their first ever ODI at the venue in 1992 and lost the match by six wickets.

ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా భారత జట్టు 3-1 విజయంతో దూసుకుపోతోంది. మూడు వన్డేల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు నాలుగో వన్డేను చేజార్చుకుంది. ఐదో వన్డే గెలిస్తే సిరీస్ కైవసం అవుతుందనే పట్టుదలతో పోర్ట్ ఎలిజబెత్ వేదికగా మ్యాచ్‌కు సిద్ధమైంది.
ఇదే వేదికగా 1992 నుంచి జరిగిన మ్యాచ్‌లలో భారత జట్టు ఒకసారి కూడా గెలిచిన దాఖలాల్లేవ్. ఈ చరిత్రను తిరగరేసేందుకు, ఈ వన్డే గెలిచి సిరీస్ ను చేజిక్కుంచుకునేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. దీని కోసం ప్రాక్టీస్ నిమిత్తం టీమిండియా రెండ్రోజుల ముందే అక్కడికి చేరుకుంది.
అక్కడికి చేరుకున్న టీమిండియాకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం లభించింది. కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలతో పాటు ఇతర ఆటగాళ్లు తాము బస చేసే హోటల్‌కు చేరుకోగా ప్రవేశ ద్వారానికి ముందు సంప్రదాయక దుస్తులు ధరించిన కళాకారులు డ్రమ్స్‌తో స్వాగతం పలికారు.
ఈ సంగీతానికి ఆటగాళ్లు కూడా ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. పాండ్యా అయితే చిందులు వేస్తూ కనిపించాడు. హోటల్‌ లోపలికి వెళ్తూ ఆటగాళ్లు వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే వారిని ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆటగాళ్లు సందడిగా గడిపారు.
కాగా ఐదో వన్డే ఫిబ్రవరి 13 మంగళవారం పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరగనుంది.

Share This Video


Download

  
Report form