Hyderabad Metro Down Due To High Ticket Prices

Oneindia Telugu 2018-02-14

Views 1K

Passengers who are travelling in Hyderabad Metro Rail is gradually decreasing. High Ticket Prices, Parking Problems at Metro Stations are the main reasons for this situation.

నగరవాసుల మెట్రో రైలు మోజు తీరింది. కొత్త మోజులో ప్రయాణికులు మెట్రో రైలులో తిరిగేందుకు ఎక్కువగా ఉబలాటపడినా ఆ తరువాత క్రమంగా తగ్గించేశారు. టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండడం కూడా ఇందుకు ఒక కారణం. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమైన రెండున్నర నెలలకే ఖాళీగా తిరుగుతోంది. ప్రారంభం సమయంలో ప్రయాణికుల తాకిడితో కిటకిటలాడిన మెట్రో స్టేషన్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రయాణికులు తగ్గడంతో ఆ ప్రభావం మెట్రో ఉద్యోగులపైనా పడింది.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి తగ్గిపోయింది. సందర్శకులు క్రమంగా తగ్గిపోవడంతో ఇక ఉద్యోగరీత్యా ఆ మార్గంలో ప్రయాణించే వారే మిగిలారు. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య బాగా పలుచబడింది. ఏ స్టేషన్‌ చూసినా అరకొరగానే ప్రయాణికులు కనిపిస్తున్నారు. ఆ ప్రభావం మెట్రో సిబ్బందిపై పడుతోంది. పెద్ద సంఖ్యలో వారి ఉద్యోగాలపై వేటు పడుతోంది.
మెట్రో ప్రారంభంలో అందులో ప్రయాణించేందుకు అమిత ఉత్సాహం కనబరిచిన ప్రయాణికులు ఇప్పుడు మెట్రో పేరు చెబితే చాలు.. ‘అమ్మో' అంటున్నారు. దీనికి కారణం మెట్రో రైలు టిక్కెట్ చార్జీలు అధికంగా ఉండడమే. దేశంలోని ఇతర మెట్రోలలో లేని విధంగా హైదరాబాద్ మెట్రో రైలులో టిక్కెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో కంటే మన దగ్గర ధరలు ఎక్కువ. మెట్రో రైలు ప్రారంభమై మూణ్ణెళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు రోజువారీ, నెలవారీ పాస్‌ల ఊసే ఎత్తడం లేదు. నిత్యం మెట్రోలో ప్రయాణించే వారికి ఇది ఇబ్బందిగా మారింది. దీంతో మెట్రో రైలు కంటే సిటీబస్సు నయం అనుకుని ఎంతో మంది వాటిని ఆశ్రయిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS