Hyderabad Metro Rail project, has announced on Wednesday a 10% discount on all trips made through smart cards up to March 31, 2018.
హైద్రాబాద్ మెట్రో రైలులో స్మార్ట్‌కార్డ్‌తో ప్రయాణం చేసేవారికి ఛార్జీలో పది శాతం రాయితీని ఎల్ అండ్ టీ ప్రకటించింది.2018 మార్చి వరకు ఈ రాయితీని అందించనున్నట్టు ఎల్ అండ్ టీ కంపెనీ తెలిపింది.
మెట్రో రైలులో ప్రయాణం చేసే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకొంటున్నట్టు ప్రకటించింది.
హైద్రాబాద్ మెట్రో రైలులో స్మార్ట్‌కార్డుతో ప్రయాణం చేసేవారికి ఛార్జీల్లో 10 శాతం రాయితీని కల్పించనున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది. డిసెంబర్ 7వ, తేది నుండి ఈ రాయితీ వర్తింపజేయనున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ 2018 మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని ఎల్ అండ్ టీ ప్రకటించింది. ప్రస్తుతం స్మార్ట్‌కార్డ్ ద్వారా ప్రయాణం చేసిన వారికి కేవలం 5 శాతం మాత్రమే రాయితీని ఇచ్చేవారు. కానీ, డిసెంబర్ 7వ, తేది నుండి పది శాతం రాయితీని అందిస్తున్నారు.
రూ.200 చెల్లించి స్మార్ట్‌కార్డును తీసుకోవాలి. ఇందులో రూ.100 ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.3వేల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏడాదిపాటు ఈ కార్డు చెల్లుబాటవుతుంది. స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద వీటిని పొందవచ్చు.