సిఎం సొంత జిల్లాలో జగన్, సర్వత్రా ఆసక్తి !

Oneindia Telugu 2017-12-28

Views 1

YSRC president YS Jagan Mohan Reddy prajasankalpa yatra entered Thursday in Chittoor district. Chief Minister Chandrababu Naidu belongs to this district, Jagan's padayatra will continue here is get interest of all political parties.


వైఎస్‌ఆర్‌ సీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర గురువారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాలో జగన్ పాదయాత్ర ఏ విధంగా సాగుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర 46వ రోజు అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి ప్రారంభమైంది. అనంతరం కొంత సమయం వ్యవధిలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎద్దులవారి కోట గ్రామంలోకి జగన్ ప్రవేశించాడు.
చిత్తూరు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్‌ జగన్‌ 260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఎద్దులవారి కోట నుంచి ఎద్దుల వేమన్నగారి పల్లి, ఆర్‌ఎన్‌ తండా, కొట్టాల క్రాస్‌ మీదుగా వసంతపురం మీదుగా గురువారం జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జిల్లాలోని తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, నగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుంది. వసంతాపురంలో ప్రజలతో వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నట్లు తెలిసింది. శ్రీకాళహస్తి నుండి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించటం ద్వారా రాయలసీమ జిల్లాల పర్యటన పూర్తవుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS