The Agri Gold is the biggest before the TDP government came in to the Power, said Chief Minister Chandrababu Naidu. At the grievance hall in Undavalli on Tuesday, CM Chandrababu distributed compensation checks to the family members those who in Agri Gold's victims.
#andhrapradesh
#amaravathi
#tdpgovernment
#cmchandrababu
అగ్రి గోల్డ్ కుంభకోణం అనేది టీడీపీ ప్రభుత్వం రాక ముందు జరిగిన అతిపెద్ద స్కామ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌హాలు వద్ద అగ్రిగోల్డ్ బాధితుల్లో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కులను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి అందరం సమన్వయంతో కృషి చేద్దామని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను తాను చాలా సీరియస్ గా తీసుకుంటున్నానని...వారి ప్రతి పైసా వసూలు చేసి ఇప్పిస్తానని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. "నేను అసోసియేషన్‌ను ఒకటే కోరుతున్నా...మీరు బాధితుల తరఫున మాట్లాడుతున్నారు. బాధితులతో కమిటీ వేసుకోండి"...అని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుకు సిఎం సూచించారు.