అవిశ్వాస తీర్మానం : వైఎస్ జగన్‌ కు పవన్ కల్యాణ్‌ సవాల్, చంద్రబాబు కు జగన్ సవాల్‌

Oneindia Telugu 2018-03-17

Views 356

Jana Sena chief Pawan Kalyan, who promised to get the support of different parties for the no-confidence motion against Modi government, stayed away from playing any such role.

ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు కూడదతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గారనే విమర్శలు ఉన్నాయి. మద్దతు కూడగడుతానని చెప్పన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు కూడా. వైఎస్సార్ కాంగ్రెసు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చింది. అయినా కూడా పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదనే విమర్సలు వస్తున్నాయి.
అవిశ్వాస తీర్మానం విషయంలో పవన్ కల్యాణ్ ప్రధానంగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను లక్ష్యం చేసుకుని సవాల్ విసిరారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ధైర్యం ఉందా అని ఆయన ఫిబ్రవరి 19వ తేదీన ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాను కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లి ఎంపీల మద్దతు కూడగడుతానని చెప్పారు. తాను 80 మంది ఎంపీల మద్దతు సంపాదించి పెడుతానని కూడా చెప్పారు.
తాను అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు మద్దతు ఇచ్చేలా చూడాలని జగన్ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. ఒక రకంగా పవన్ కల్యాణ్ సవాల్ కారణంగానే, తాను మోడీకి భయపడుతున్నాననే ముద్రను తొలగించుకోవడానకి వైఎస్ జగన్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు వచ్చారు. ఆ మేరకు వైసిపి నోటీసు కూడా ఇచ్చింది.
జగన్ సవాల్‌కు చంద్రబాబు వెంటనే స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం దిగిరాదనేది స్పష్టమైన తర్వాత, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తననే లక్ష్యం చేసుకుని మాట్లాడిన తర్వాత వైసిపి ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇస్తానని చెప్పారు. అయితే, తెల్లారే సరికి వ్యూహాన్ని మార్చుకుని తమ పార్టీయే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందని చెప్పి ఎన్డిఎ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు.
వైసిపితో పాటు తెలుగుదేశం కూడా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించిన తర్వాత పవన్ కల్యాణ్ దాని గురించి ప్రస్తావించడం మానేశారు. గుంటూరులో వామపక్షాల బేటీ తర్వాత ఆ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించే తేదీని వైసిపి ఎందుకు మార్చుకుందని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి అంత హడావిడి ఏమిటని అడిగారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS