Mahesh Kathi vs Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఘోరీ కడ్తా !

Oneindia Telugu 2018-01-05

Views 2

Mahesh Kathi says "PK has become a virus. He is more dangerous than HIV that is eating away a generations rational behaviour and civic sense".

సినీ విమర్శకుడు మహేష్ కత్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేస్తున్న వరుస విమర్శల నేపథ్యంలో మరో తీవ్రమైన వ్యాఖ్య చేశారు. మరోసారి పవన్ కల్యాణ్ అభిమానులపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.
పవన్ కల్యాణ్ వైరస్‌లా మారాడని, హెచ్ఐవి కన్నా ప్రమాదకరంగా పరిణమించాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి ఆయన తన వ్యాఖ్యలను ఆంగ్లభాషలో ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పవన్ కల్యాణ్ తనపై చేస్తున్న ప్రచారాన్ని కూడా ఎత్తిచూపారు.గత కొన్ని నెలలుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దీన్ని పంపిణీ చేస్తున్నారని మహేష్ కత్తి వ్యాఖ్యానిస్తూ దానికి సంబంధించిన ఇమేజ్‌ను కూడా పోస్టు చేశారు. దాన్ని చూసి తన మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారని, వాస్తవమేమిటో తెలుసుకోవడాని ఫోన్లు కూడా చేశారని ఆయన అన్నారు. అది తీవ్రమైన స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు.
అంతకముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక పవన్ కల్యాణ్ అభిమానుల వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసినట్లు కనిపించినప్పటికీ ఆయన నేరుగా పవన్ కల్యాణ్‌నే టార్గెట్ చేశారని చెప్పవచ్చు. ఇది ఎంత దూరం పోతుందనేది చెప్పలేని స్థితి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS