Chandrababu Naidu Warning to YS Jagan Over Investments

Oneindia Telugu 2018-02-28

Views 450

Andhra Pradesh CM Nara Chandrababu Naidu made serious comments against the YSR Congress party presidnt YS Jagan over Sakshi newspaper about Investments.

ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. సిఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందాలన్నీ మోసంగా పరిగణస్తావా అంటూ ఆయన జగన్‌ను అడిగారు. ఉదయం లేస్తూనే నీ పేపరు (సాక్షిదినపత్రిక) చూస్తే హృదయం భగ్గుమంటుందని ఆయన మండిపడ్డారు. నీలా ఇంట్లో కూర్చుని దొంగ లెక్కలు రాయలేదని, 16 నెలల పాట జైల్లో కూర్చోలేదని విరుచుకుపడ్డారు.
జగన్‌కు రాజకీయ, పాలనానుభవం ఏముందని చంద్రబాబు అడిగారు. చంద్రబాబు మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2016,, 2017 సదస్సుల్లో కన్నా బాగా వడపోసి వాస్తవాలకు దగ్గరగా ఉన్న ఒప్పందాలే చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఒప్పందాలకు సంబంధించిన సమాచారమంతా పారదర్శకంగా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉంచుతున్నామని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కూడా ఎవరెవరికి వచ్చాయో వివరిస్తామని చెప్పారు. ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాలు పారదర్శకంగా చేసుకుంంటుంటే మోసం చేస్తుందంటూ నీ పత్రికలో రాయిస్తావా అని ఆయన జగన్‌పై మండిపడ్డారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెబుతూ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ది జరగలేదని ప్రజల్లో అపోహలు కల్పంచేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్ విభజన జరిగిన తర్వాత మూడున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని చంద్రబాబు చెప్పారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేయడం చాలా బాధ కలిగించిందని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS