Revanth Reddy is being invited by Uttam Kumar Reddy, to the Huzurnagar by-election campaign, which is a debate on the party's winning shores.MP Revanth Reddy opposes the announcement that Uttam Kumar Reddy's wife Padmavati is going to be held for the Congress party in the hujurnagar assembly constituency election. How is Uttam Kumar going to announce before the name of Padmavathi is chosen. Revanth Reddy analyses that there are all the qualifications for chama Kiran Reddy, and the people of the hujurnagar, hat they are solving their problems.
#telanganapolitics
#congress party
#byelection
#uttamkumarreddy
#revanthreddy
#trs
#Padmavati
#hujurnagar
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి. సాదారణ ఎన్నికలప్పుడు కానీ, ఉప ఎన్నికలప్పుడు గానీ పార్టీ వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది. నేతల మద్య సఖ్యత ఉన్నట్టే కనిపిస్తుంది కాని ప్రచారంలో మాత్రం ఎవ్వరూ కనబడరు. ఆశించిన నేతలు కాకుండా ఎవరో అకస్మాత్తుగా ప్రచారంలో తళుక్కుమంటుంటారు. బహిరంగ సభల్లో అసలు విషయం పక్కన పెట్టి నేతలు ఒకరి మద్య ఒకరు ఘాటు ఆరోపణలు గుప్పించుకుంటారు. ఇదేంటీ స్వామీ అంటే కాంగ్రెస్ లో అలాంటివి సహజమే అని లైట్ గా తీసుకుంటారు నేతలు. ఇప్పుడు అలాంటి సందర్బమే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఇద్దరు ఉద్దండ నేతల మద్య ఇగో సమస్య తలెత్తి హుజూర్ నగర్ ఉప ఎన్నిక పై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలకు, అంతర్గత కీచులాటలకు కొదవ ఉండదు. ఒక్కోసారి అవి శృతిమించి బజారున కూడా పడుతుంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ని సర్ధుకున్నట్టు కనిపిస్తుంటాయి. ఇదే అంశంపై కొంత మంది సీనియర్ నేతలు గమ్మత్తైన సమాధానం చెప్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత వివాదాలు సర్వ సాదారణమని, అది కొన్ని సందర్బాల్లో పార్టీకి మేలు చేస్తుందని ఉదాహరణలు కూడా చెప్పుకొస్తుంటారు. గల్లీ లో మొదలైన పంచాయితీలు కొన్ని సందర్బాల్లో ఢిల్లీ వరకూ చేరుతుంటాయి. ఢిల్లీ పెద్దల సమక్షంలో కొన్ని పంచాయితీలు పరిష్కారం కాబడతాయంటే ఆశ్చర్యం వేయక మానదు.