Gujarat Assembly Election Opinion Poll : Congress Gains Ground

Oneindia Telugu 2017-12-05

Views 1.7K

A poll conducted ahead of the Gujarat elections has suggested a photo finish. The Lokniti-CSDS-ABP News predicted an equal vote share for both the BJP and Congress. Amit Shah was dreaming of winning 165 seats out of 182 seats

గుజరాత్ లో బీజేపీ గెలుపు కన్ఫర్మ్ అని ఇంతకాలం అనుకున్న ఆపార్టీ నేతలు ఇప్పుడు షాక్ కు గురౌతున్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇస్తోందని సర్వేలు చెప్పడంతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. తాజా సర్వే యూటర్న్ కావడంతో గుజరాత్ బీజేపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైయ్యింది.
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. గుజరాత్‌ శాసన సభ ఎన్నికలు ఇరు పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు అద్దం పడుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే అనేక సర్వేలు బీజేపీకి విజయం కట్టబెట్టాయి. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం లేదని గత సర్వేలు తేల్చి చెప్పాయి.
2012 శాసన సభ ఎన్నికలతో పోల్చుకుంటే 2017 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నది. ఆ పార్టీకి 78 నుంచి 86 స్థానాలు దక్కే అవకాశం ఉందని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే చెప్పింది. అయితే లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే గతంలో విడుదల చేసిన సర్వేకి ఇప్పటి సర్వేకి చాల వ్యత్యాసం ఉంది. ఆగస్టు నెలలో లోక్ నీతి-సీఎస్ డీఎస్ చేసిన సర్వేలో బీజేపీకి కచ్చితంగా 150 సీట్లుకు పైగా వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 30 సీట్లకే పరిమితం అవుతోందని సర్వే విడుదల చేసింది. అయితే ఇప్పుడు హార్దిక్ పటేల్, దళిత, బీసీ వర్గాల నాయకుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుందని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే చెబుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS