Gujarat Assembly Election 2017 : BJP Releases Third List Of 28 Candidates | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-20

Views 97

The ruling BJP released its third list of 28 candidates for the Gujarat Assembly election to be held on two phases on December 9 and 14.

గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ శాసన సభ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గుజరాత్ శాసన సభ ఎన్నికలు 2017ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం చాలెంజ్ గా తీసుకుంటున్నారు. సోమవారం గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా బీజేపీ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. సోమవారం మూడో జాబితాలో 28 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది.
మూడు జాబితా లు బయటకు రావడడంతో కొన్ని వర్గాలు లో సంతోషం, కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అయ్యింది. శనివారం గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 36 మంది అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. అందులో ఓ మంత్రితో సహ 12 మంది ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చెయ్యడానికి నిరాకరించిన అధిష్టానం కొత్త వారికి అవకాశం ఇచ్చింది. వీరిలో 13 మంది ఎస్సీలకు, ఇద్దరు ఎస్టీలకు టిక్కెట్లు ఇచ్చింది. కాగా, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సన్నిహితుడు కేతన్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు బీజేపీలో చేరారు. ఐతే బీజేపీ విడుదల రెండో జాబితాలో చోటు దక్కుతుందని ఆశపడి, భంగపడిన నాయకులుపార్టీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. తమకు అవకాశం ఎందుకివ్వలేదంటూ మండిపడ్డారు. రెండో జాబితాలో మార్పులు చేయకుంటే ఆయా స్థానాల్లో బీజేపీ ఓటమి ఖాయమంటూ నినాదాలు చేశారు.

Share This Video


Download

  
Report form