Congress leader Shankersinh Vaghela on Tuesday asserted that he had not voted for the official party nominee Ahmed Patel in the crucial Gujarat Rajya Sabha polls being held here.
గుజరాత్ లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతోందని స్పష్టంగా వెలుగు చూసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.