Upcoming Rajya Sabha biennial polls are raising lot of political heat in Andhra Pradesh. There are three seats and going by the numbers, it would be a smooth sailing for the TDP in two seats and YSRCP has enough numbers for winning the third seat.
రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఖాళీ అయిన మూడు స్థానాల్లో టీడీపీకి రెండు, వైసీపీకి ఒక స్థానం దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి రాజ్యసభ సీటు కోసం ముగ్గురు వ్యక్తుల మధ్య పోటీ నడుస్తున్నట్టు చెబుతున్నారు. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య, ఎంపీ సీఎం రమేష్, కావలి ఇన్‌చార్జీ బీద మస్తాన్ రావుల పేర్లను తుది దశ పరిశీలనకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ప్రత్యేక హోదాపై రగడ జరుగుతున్నవేళ.. సీఎం రమేష్ లాంటి దూకుడైన నేత రాజ్యసభలో ఉంటే మంచిదని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఓ మారు రాజ్యసభ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన.. మరోసారి పదవి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.