The ruling BJP has eight candidates and is supporting a ninth, an independent member. A party needs 37 votes to win each seat in UP. The BJP, with over 300 lawmakers, is assured of a victory in eight seats. The SP can easily win a seat. Mayawati's party, which has 19 lawmakers, will have the support of eight SP members, seven Congress members and one of Ajit Singh's party.
దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 58 రాజ్యసభ స్థానాలకు 63 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న బీజేపీకే అత్యధిక రాజ్యసభ సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో బీజేపీకి 311 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆ పార్టీకి 8 సీట్లు కచ్చితంగా వచ్చే అవకాశముంది. బీహార్‌లో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ-జేడీయూ కూటమికి మూడు సీట్లు వస్తాయి. మహారాష్ట్రలో బీజేపీకి 2, శివసేనకు 1, కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు వచ్చే అవకాశముంది. 5 సీట్లు ఖాళీగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి నాలుగు సీట్లు రావొచ్చు.
మధ్యప్రదేశ్‌లోనూ ఐదు సీట్లలో బీజేపీకి నాలుగు స్థానాలు రావొచ్చు. గుజరాత్‌లో కాంగ్రెస్, బీజేపీలు చెరో రెండు స్థానాలు గెలుచుకునే అవకాశముంది. అన్నింటికంటే ఉత్తర ప్రదేశ్‌లో రాజ్యసభ పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంటుంది. తొమ్మిదో సీటు కోసం కొన్ని ఓట్లు తక్కువ పడతాయి. దీంతో బీజేపీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చింది.
ఉత్తర ప్రదేశ్‌లో ఒక్కో అభ్యర్థికి 37 ఓట్లు అవసరం. బీజేపీ 300 మందికి పైగా ఎమ్మెల్యేలను కలిగి ఉంది. తమకు ఉన్న అభ్యర్థులతో ఎస్పీ కూడా ఒక సీటును గెలుచుకుంటుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎస్పీ తమ అభ్యర్థికి ఓటు వేయగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ ఎనిమిది మంది బీఎస్పీ అభ్యర్థికి మద్దతిస్తారు.
దీంతో బీఎస్పీ అభ్యర్థికి మొత్తం 27 ఓట్లు వస్తాయి. వీటికి తోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు, అజిత్ సింగ్ పార్టీకి చెందిన ఒకరు కూడా మద్దతిస్తున్నారు. వీరితో కలుపుకుంటే బీఎస్పీకి మద్దతిచ్చే వారి సంఖ్య 35కు చేరుకుంటుంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతిస్తున్నారు. దీంతో బీఎస్పీ గెలవొచ్చు. కానీ బీఎస్పీ, ఎస్పీల నుంచి జైలుకు వెళ్లిన ఒక్కో ఎమ్మెల్యే (మొత్తం ఇద్దరు) ఓట్లు చెల్లకపోవచ్చు. ఇదే ఇప్పుడు బీఎస్పీకి చిక్కులు తెచ్చి పెడుతోంది.