Gujarat Assembly elections on December 9 and 14 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-25

Views 120

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నిక కమిషన్ ప్రధాన అధికారి అచల్ కుమార్ జ్యోతి నేడు షెడ్యూల్ ను విడుదల చేశారు. 4.43 కోట్ల మంది ఓటర్లు ఉన్న గుజరాత్ లో డిసెంబర్ 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి
మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు చేపడతారు. గుజరాత్ అసెంబ్లీ కాలం 2018 జనవరి 22తో ముగుస్తుంది. ఎన్నికల కోసం గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 50,128 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
భారతీయ జనతా పార్టీకి గత 22ఏళ్లుగా కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో మరోసారి ఆ పార్టీ విజయకేతనం ఎగురవేయనున్నట్లు తెలుస్తోంది. ఇండియాటూడే-ఆక్సిస్ మైఇండియా ఓపినియన్ పోల్స్ ఈ మేరకు వెల్లడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS