A day after Alpesh Thakor shared the stage with Rahul Gandhi at a rally in Gandhinagar, around two dozen supporters wait outside his small office in north Ahmedabad, in the hope that he will address them.
గుజరాత్‌లో 22 ఏళ్ల క్రితం ఒకరు బీజేపీ అధికారానికి వచ్చినప్పుడు రెండేళ్ల పసిబాలుడు, మరొకరికి పన్నెండేళ్లు, ఇంకొకరు 18 ఏండ్ల టీనేజ్ యువకుడు. ఆ వయసులో వారికి లోకం పోకడ, రాజకీయాలు తెలియవు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు ప్రజా నాయకులుగా ఎదిగారు. తమ సామాజిక వర్గాలకు నాయకత్వం వహిస్తూ గుజరాత్‌లో అధికార బీజేపీకి దడ పుట్టిస్తూ గంగ వెర్రులెత్తిస్తున్నారు. వారే పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ (24), దళిత వర్గాల నాయకుడు జిగ్నేశ్ మేవాని (34), ఓబీసీల నేతగా ఎదిగిన అల్పేశ్ ఠాకూర్ (40).