Many BJP MLAs are said to be apprehensive that PM Modi and party chief Amit Shah may implement their timetested formula of denying tickets to sitting members to beat anti-incumbency. However, some are hopeful that state’s new political matrix may force the high command to avoid antagonising them to check defections.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు గతంలోని తమ వ్యూహాన్ని అమలు చేస్తారా? అనే చర్చ సాగుతోంది. అదే జరిగితే పలువురు సిట్టింగులకు టిక్కెట్లు రావు.గుజరాత్‌లో ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. 2001 నుంచి ప్రధాని అయ్యే వరకు నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితులు బీజేపీకి అననుకూలంగా మారాయి. హార్దిక్ పటేల్, జిగ్నేష్ హేవానీ, అల్పేష్ ఠాకూర్‌ల కారణంగా కమలం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.పైగా ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రజా వ్యతిరేకత కొట్టిపారేయలేం. ప్రజావ్యతిరేకత, స్థానిక పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని మోడీ - షా ద్వయం కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించవచ్చునని భావిస్తున్నారు2007లో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ 47 మంది సిట్టింగులకో టిక్కెట్ నిరాకరించారు. 2012లో దాదాపు ముప్పై మందికి టిక్కెట్ నిరాకరించారు. 2002లో మాత్రం కేవలం 18 మందికి మాత్రమే టిక్కెట్ ఇవ్వలేదు. అయితే, ఈసారి ప్రజా వ్యతిరేకత, హార్తిగ్ పటేల్, జిగ్నేష్, అల్పేష్‌ల ప్రభావం, స్థానిక కారణాలతో ఎంతమందికి టిక్కెట్ నిరాకరిస్తారోననే చర్చ సాగుతోంది.