RGV- Nagarjuna New Film Details "శివ" కాంబో మళ్ళీ రిపీట్

Filmibeat Telugu 2017-11-02

Views 1

Ram Gopal Varma also went on to elaborate that it will be an action film. Nagarjuna has done more family-oriented films of late so it will be interesting to see him in a complete action film.
నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ ఈ రెండు పేర్లకూ విడదీయరాని బంధం ఉంది. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి "శివ" అటు వర్మనీ, నాగార్జుననీ వాళ్ళతో పాటు తెలుగుసినిమా ఫార్మేట్ నీ మార్చి పడేసింది. ఆ సినిమా విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త దర్శకులకు ఓ నిఘంటువులాంటిదని చెప్పాలి.
రాంగోపాల్‌ వర్మ టాలెంట్‌ని గమనించి ఆ సినిమాతో దర్శకునిగా పరిచయం చేశాడు నాగార్జున. అసలు సెంటిమెంట్లు ఉండని వాడు అనుకునే వర్మ ఈ విషయం లో నాగార్జునకి మాత్రం "థాంక్ యు నాగ్ ఆ రోజు నువ్విచ్చిన అవకాశం వల్లే నేనిలా ఉన్నాను" అంటూ కన్నీళ్ళతో చెప్పాడు...
అదే కాంబినేషన్‌లో శివ తరవాత చేసిన "గోవిందా గోవిందా" మాత్రం అదే టైటిల్ ని రిపీట్ చేస్తూ వెళ్ళిపోయింది.ఆ తర్వాత ‘అంతం' సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా ప్రశంసలు అందుకుంది గానీ మరీ పెద్ద హిట్ కాదు ఇక ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పని చేయలేదు. కానీ మిత్రులుగా కలిసే ఉన్నారు.
అలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఇప్పుడు మళ్ళీ దాదాపు ఇరవైఅయిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా రాబోతోంది... ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను రూపొందించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కంటే ముందే నాగార్జునతో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన వర్మ.. తాజాగా ఇందుకోసం ముహూర్తం ఖరారు చేశాడు.

Share This Video


Download

  
Report form