SS Rajamouli’s mega project with Jr NTR and Ram Charan is set to go on floors in October. The final scripting is still being done by Rajamouli’s father – K. V. Vijayendra Prasad and the shoot will begin from October 2018. In the film, Jr NTR will also be seen showcasing his six pack abs. With so much buzz surrounding the film, the movie will be shot under strict security.
బాహుబలి చిత్రం తర్వాత దర్శకుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ చిత్రంలో బాహుబలి మాదిరిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ చోటు ఉందని రాజమౌళి వర్గాలు వెల్లడిస్తున్నాయి. రోజు రోజుకు ఈ సినిమాపై భారీ అంచనాల పెరుతుండటమే కాదు.. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇటీవల అమెరికాలో 10 రోజులపాటు టెస్ట్ షూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తున్నది.
అయితే సినీ వర్గాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ సోదరులుగాను, బాక్సర్లుగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నాడట. అందుకోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ నిపుణుల సహకారంతో దేహధారుడ్యాన్ని పెంచుకొంటున్నట్టు తెలిసింది. జిమ్‌లో ఎన్టీఆర్ చేస్తున్న కసరత్తు ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం తెలిసిందే. అయితే టాలీవుడ్ చరిత్రలో రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి మెగా, నందమూరి హీరోలు ఇద్దరు కలిసి నటిస్తున్నారు, దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగినట్టే రాజమౌళి పాత్రల పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది.
ఇక పోతె కథ, కథనాలకు సంబంధించిన పని పూర్తయినప్పటికీ.. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరి, మార్చి 2019 లోపు సినిమాను కంప్లీట్ చేయాలనే ప్లాన్‌తో రాజమౌళి ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాది వేసవి బరిలో రాజమౌళి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.