Chiranjeevi Sye Raa targets Baahubali, Dangal బాహుబలి, దంగల్ కి పోటీగా 'సైరా'

Filmibeat Telugu 2018-03-09

Views 579

Megastar Chiranjeevi Sye Raa to release in China. Shooting will also happened in china. Chiranjeevi is busy shooting for his film Sye Raa, with Amitabh Bachchan joining the unit in a few days time.
మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్ర షూటింగ్ బిజీగా జరుగుతోంది. మెగాస్టార్ 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత గాధగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ విషయంలో సైరా యూనిట్ భారీ ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం సైరా యూనిట్ మొత్తం చైనా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల పాటు చైనాలో చిత్రీకరిస్తారట. సైరా సినిమా కోసం మెగా కాంపౌండ్ చేస్తున్న ఖర్చు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చైనాలో ఎంటర్టైన్మెంట్ టాక్సులు తక్కువగా ఉంటాయి కావున కీలక సన్నివేశాలని అక్కడ షూట్ చేయాలని భావిస్తున్నారు

ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ బిజీగా జరుగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS