Pro Kabaddi League 2017: Gujarat Fortune Giants beat Dabang Delhi

Oneindia Telugu 2017-08-02

Views 13

Gujarat Fortunegiants rode on an all-round show as they became the first of the four new teams to start their Pro Kabaddi journey with a win. Sukesh Hegde-led Gujarat side registered a 26-20 win over Dabang Delhi


ప్రో కబడ్డీ లీగ్‌లో తొలిసారిగా బరిలో దిగిన గుజరాత్‌ ఫార్చున్ గెయింట్స్ జట్టు మొదటి మ్యాచ్‌లోనే శుభారంభం చేసింది. మంగళవారం గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంది. 26-20తో టోర్నీ ఫేవరెట్ దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ సుకేశ్‌ హెగ్డే అనుభవం గుజరాత్‌‌కు ఎంతో లాభించింది. గుజరాత్ జట్టులోని డిఫెండర్ ఫాజెల్ అట్రాచాలి ప్రత్యర్థి జట్టులోని రైడర్స్‌ను దీటుగా నిలువరించడంతోపాటు 4పాయింట్లను సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Share This Video


Download

  
Report form