మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంటుంది.. అని పలు సందర్భాల్లో అనేకమంది మిత్రులను, మన కంప్యూటర్ ఎరా మేగజైన్ పాఠకులను అడిగితే చాలా కొద్ది మంది మాత్రమే ఏవరేజ్ ఎంత స్పీడ్ వస్తుందో చెబుతూ ఉంటారు. అసలు చాలామందికి ప్రతీ క్షణం తాము ఇంటర్నెట్ లో ఎంత వేగంతో ఫైళ్లని డౌన్ లోడ్ చేసుకోగలుగుతున్నామో, ఎంత వేగంతో ఫైళ్లని అప్ లోడ్ చేయగలమో ఎలా తెలుసుకోవాలో తెలియని పరిస్థితి. కొంతమంది speedtest.net వంటి సైట్ల లో శాంపిల్ speed testలు జరుపుకుని అవే కరెక్ట్ స్పీడ్ లని నమ్ముతుంటారు. అలాంటి సైట్లలో మనం సెలెక్ట్ చేసుకునే సర్వర్ లొకేషన్, ఫైల్ సైజ్, ఆ సర్వర్ పై ఆ సమయంలో ఉన్న లోడ్ వంటి పలు అంశాల వల్ల మన నెట్ కనెక్షన్ స్పీడ్ ఎంతో సరిగ్గా తెలుసుకోలేము. దీనికన్నా మెరుగ్గా మన నెట్ స్పీడ్ ని తెలుసుకోవడంతో పాటు, ఏరోజు, ఏ వారం, ఏ నెల ఎంత డౌన్ లోడ్ చేసుకున్నారన్నది రిపోర్టులు సైతం పొందడం ఎలాగో ఈ క్రింది వీడియోలో వివరంగా డిమాన్ స్ట్రేట్ చేశాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine