అనుకున్నదే జరిగింది! ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీసు గెలవాలన్న టీమ్‌ఇండియా ఆశలు అడియాసలే అయ్యాయి! ఆంగ్లేయులను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించాలన్న కోరిక నెరవేరలేదు. నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత్ ఓటమి చవిచూసింది. కనీసం మ్యాచును డ్రా చేసుకోలేక చేతికిందిన సిరీసును వదిలేసింది! ఎడ్జ్‌బాస్టన్‌లో 378 పరుగుల టార్గెట్‌ను స్టోక్స్ సేన అలవోకగా ఛేదించింది. మరో 7 వికెట్లు ఉండగానే గెలుపు తలుపు తట్టింది. ఐదు టెస్టుల సిరీసును 2-2తో ముగించింది. మాజీ కెప్టెన్ జో రూట్, జానీ బెయిర్‌స్టో తిరుగులేని సెంచరీలతో అదరగొట్టారు.