అల్లూరి సీతారామరాజు జిల్లా Araku మండలం మడగడ గ్రామంలో.... ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి ఆయన వచ్చారు. తమ భూములను ఆక్రమించారని, సమాధానం చెప్పాలంటూ ఆయన మెడలోని కండువా పట్టుకుని మరీ కొందరు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం ఏర్పడటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.