అనకాపల్లి జిల్లాలో MLA పేట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. నాతవరం మండలం పెద గొలుగొండపేటలో.... తమకు ఆసరా పథకం మంజూరు చేయలేదని కొంతమంది మహిళలు ఎమ్మెల్యే వద్ద విన్నవించుకున్నారు. ఇదే విషయమై తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేను నిలదీశారు. సహనం కోల్పోయిన ఉమాశంకర్ గణేష్...గట్టిగా అరిచారు. ఘర్షణ వాతావరణం నెలకొనటంతో పోలీసులు జనాలను చెదరగొట్టారు.