జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్థులు ఆయనను అడ్డుకున్నారు. గోదావరి పరీవాహక గ్రామం కావటంతో ప్రస్తుత పరిస్థితి పరిశీలించేందుకు అర్వింద్ అక్కడికి వెళ్లారు. ఎంపీగా గెలిపిస్తే గ్రామంలో బ్రిడ్జి కట్టిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని గ్రామస్థులు నిలదీశారు. మల్లన్నగుట్ట సమస్యకు పరిష్కారం ఏదని ప్రశ్నించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్ లోని రెండు వాహనాల అద్దాలు పగులగొట్టారు.